రోగులకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రి లకు విధ్యుత్ అంతరాయం లేకుండా చూడాలి అంటున్న రోగులు.
మారికవలస :విశాఖ లోకల్ న్యూస్ :
మధురవాడ, జోన్ 2, మారికవలస లో గాయత్రి విద్యా పరిషత్ ఆసుపత్రి లో విశాఖపట్నం లోనే అతి తక్కువ ధరలో నిరు పేదలకు చికిత్స అందిస్తూ సేవ చేస్తున్నారు. అటువంటి ఆసుపత్రి లో నిత్యం విద్యుత్ సమస్య వేదిస్తుంది అని రోగులు తెలుపుతున్నారు. ఆరోగ్య శ్రీ లేక పోయిన, రోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారని రోగులు అభినందిస్తున్నారు.ఆపరేషన్ అయ్యిన రోగులకు డ్రెస్సింగ్ చేస్తున్న సమయంలో పవర్ పోవటం తో చరవాణి వెలుగులో డ్రెస్సింగ్ చేయవలసి వస్తుంది రోగులు వాపోతున్నారు.ప్రభుత్వం ఇటువంటి ఆసుపత్రులకైనా విధ్యుత్ కొరత లేకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.


