వేములవలస లో అద్వానంగా డ్రైనేజీ : పట్టించుకోని ఎన్ హెచ్ ఏ సిబ్బంది: పరిష్కారానికి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్.

 వేములవలస లో అద్వానంగా డ్రైనేజీ : పట్టించుకోని ఎన్ హెచ్ ఏ సిబ్బంది

: పరిష్కారానికి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్'

ఆనందపురం :

 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వేములవలస కూడలిలో ప్రయాణికులు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని

 టిడిపి యువ నాయకుడు, స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేములవలస కూడలిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో  వర్షాలు పడేటప్పుడు నీరు

 గ్రామంలోకి చొచ్చుకొని కొని రావడం తో ప్రజలు  అనేక ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని అన్నారు. వేములవలస పూల మార్కెట్ నుంచి వెల్లంకి ఎస్బిఐ బౌండరీ వద్ద గల కాలువ వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని  అలాగే బ్లాక్ టాప్ సర్వీస్ రోడ్డు వెయ్యాలని ఆయన కోరారు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో  భాగంగా షాపులు కోల్పోయిన చిరు వ్యాపారస్తులకు స్థలాలు కేటాయించాలని,మినీ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 

 కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఆయన నేషనల్ హైవే ఆధారిటీ అధికారులకు వినతి పత్రం సమర్పించినట్టు పేర్కొన్నారు.