జీఓ నెంబర్ 117 పునరాలోచించాలి: వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర సురేష్ కుమార్.

జీఓ నెంబర్ 117 పునరాలోచించాలి:  వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర సురేష్ కుమార్.

విశాఖ లోకల్ న్యూస్:

జీఓ నెంబర్ 117 పునరాలోచించమని కోరుతూ వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర సురేష్ కుమార్ మరియు  మండలంలో గల పాఠశాల కమిటీ  చైర్మన్లు , వైస్ చైర్మన్లు మండల విద్యాధికారి ఎస్ ఎస్  పద్మావతి కి వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మద్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ జీఓ నంబర్ 117ను విడుదల చేసింది. కాని ఈ రకంగా విలీనం చేయడం వల్ల విద్యార్థుల డ్రాప్ ఔట్ పెరుగుతుంది. అంతేకాకుండా  హై స్కూల్ కి వెళ్లాలంటే 1-3 కిలో మీటర్ల దూరం ప్రధానమైన రోడ్డు మార్గాల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన ట్రాఫిక్ వలన ఈ విద్యార్ధులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
అప్పట్లో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి, నూతన తరగతులు గదులను కూడా నిర్మించి, ఇప్పుడు జీవో నెంబర్ 117 పేరుతో విద్యార్థులకు పాఠశాలను దూరం చేసే ఆలోచన సరికాదని, ఇక్కడున్నటువంటి పాఠశాలను తరలించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయని చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇంత అభివృద్ధి చేసిన పాఠశాలను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వ అధికారులు పునరాలోచన చేయాలని, పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.కావున ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి,  ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు స్వచ్చంద సంస్థల అభిప్రాయాలను సేకరించాలని, తద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాము. ఈ జీవో వలన వస్తున్న సమస్యలను అర్ధం చేసుకుని, జీఓ నెంబర్ 117 విషయమై పునరాలోచించమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో సొంట్యం స్కూల్ ఛైర్మన్ బొద్దపు బంగార్రాజు,ఆనందపురం స్కూల్ ఛైర్మన్ చందక  ఆప్పలనాయుడు,పెద్దిపాలెం యు.పి స్కూల్ చైర్మన్ లావేటి జగన్నాధ రావు, వెల్లంకి స్కూల్ వైస్ చైర్మన్ మాదాబత్తుల బుజ్జి
 తదితరులు పాల్గొన్నారు.