ఏపీ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు- నేటి నుంచి మొదలు-అసలు కారణమిదే ?

 ఏపీ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు- నేటి నుంచి మొదలు-అసలు కారణమిదే ?

అమరావతి:

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నా దాని ప్రభావం మాత్రం పూర్తిస్ధాయిలో కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. 

తాజాగా విడుదలైన ఓ జాతీయ స్ధాయి సర్వేలోనూ పాలనలో సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందంటూ వార్తలొచ్చాయి.                  

ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏమనుకుంటున్నారు, సచివాలయాల్లో వారికి అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి ? లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది.

సచివాలయాల్లో తనిఖీలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ,వార్డు సచివాలయాల్లో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది.ఇప్పటికే ప్రతీ సంక్షేమ పథకాన్నీ సచివాలయలకు లింక్ చేసిన ప్రభుత్వం.     

ఇప్పుడు అవి ఎలా అమలవుతున్నాయి, వాటిపై ప్రజలు ఏమను కుంటున్నారనేది తెలుసుకోవాలని భావిస్తోంది.         

ఇందుకోసం నేటి నుoచి రెండు రోజులపాటు గ్రామ,వార్డు సచివాలయాలల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.

తనిఖీలు చేసేది వీరేరాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీల కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగిస్తోంది.   

ఇందులో మొదటిగా తహసీల్దార్,రెండు మునిసిపల్ కమిషనర్లు, మూడు జాయింట్ కలెక్టర్లు ఈ తనిఖీలు చేపట్ట బోతున్నారు. 

వారానికి ఈ మూడు శాఖలల్లో ఇద్దరు చొప్పున తనిఖీలు నిర్వహించి సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.దీంతో సంబంధిత అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటారు.

తనిఖీల లక్ష్యమిదే !రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపడుతున్న తనిఖీల్లో ఏయే అంశాల్ని పరిశీలించాలన్నది కూడా కలెక్టర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.           

ఇందులో సచివాలయాల్లో ప్రతి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.          

రెవిన్యా శాఖల్లో డాష్ బోర్డులో వేలల్లో అప్పికేషన్ పెండింగ్ లో వున్నాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.             

ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు...!!