ఉత్తర నియోజకవర్గం: విశాఖ లోకల్ న్యూస్
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ముఖ్య నాయకులతో సమావేశం
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం లో గల అన్ని వార్డుల ప్రెసిడెంట్ లు మరియు ముఖ్య నాయకులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డు లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకులు వార్డు ప్రెసిడెంట్ లు సెక్రటరీ లు పాల్గొన్నారు.

