గోదావరి నది ప్రాంత వరద బాధితులకు అండగా నిలిచిన జగన్ అన్న చేయూత ట్రస్ట్

గోదావరి నది ప్రాంత వరద బాధితులకు అండగా నిలిచిన జగన్ అన్న చేయూత ట్రస్ట్.

పాలకొల్లు, 

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు నియోజకవర్గంలో వరద ముప్పుకు గురైన గ్రామల్లో *జగన్ అన్న చేయూత ట్రస్ట్* అధ్యక్షులు *కొలుసు మోహన్ యాదవ్*  ఆదేశాల మేరకు జిల్లా చైర్ పర్సన్ *మనుబర్తి లలిత* అధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు *నిత్యావసర సరుకులు,పాలు,దుప్పట్లు,బ్రెడ్ ప్యాకెట్లు,పులిహోర ప్యాకెట్లు, బట్టలు* పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ అన్న చేయూత ట్రస్ట్ జిల్లా ప్రెసిడెంట్ *కాళిదాసు సుజ్ఞాని*, వైస్ ప్రెసిడెంట్ *ఉండ్రాజవరుపు గీత*, ప్రధాన కార్యదర్శి *ఝాన్సీ లారెన్స్*, *నరకుదురు సుమతి* మరియు జిల్లా, నియోజకవర్గం కమిటి సభ్యులు పాల్గొన్నారు.