భీమిలి :విశాఖ లోకల్ న్యూస్
కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ గా పి.వి.వి.ప్రసాద రావు పట్నాయక్
ఉత్తరాంధ్ర జోన్ కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ గా విశాఖ పార్లమెంట్ ,ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామ వాస్తవ్యులు,పట్నాయకుని వెంకట వర ప్రసాదరావు నియమించడం జరిగింది.ఈ నియామక పత్రాన్ని, ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్, పాకలపాటి రవి రాజు వెల్లంకి లో,నివాసం లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పి.వి.వి. ప్రసాదరావు, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బిజేపి ఆనందపురం మండల అధ్యక్షులుగా పనిచేశారు, ఆయన సేవలు గుర్తించి, ఉత్తరాంధ్ర,కిసాన్ మోర్చా జోనల్ సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా పి.వి.వి.ప్రసాద రావు పట్నాయక్ మాట్లాడుతూ,బిజేపి పార్టీ లో సేవలందించినందుకు, ఉత్తరాంధ్రలో, ఈ అవకాశం కల్పించినందుకు, కిసాన్ మోర్చా, రాష్ట్ర అధ్యక్షులు,వంగల శశిభూషణ్ రెడ్డి కి, ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్, పాకల పాటి రవి రాజు కి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, రామకృష్ణ కి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

