ప్రిన్సెస్ ఆప్ ఏ.పీ అండ్ తెలంగాణ టైటిల్ విన్నర్ అనుశ్రీ కి సత్కారం:
విశాఖ లోకల్ న్యూస్
ప్రిన్సెస్ ఆప్ ఏ.పీ అండ్ తెలంగాణ టైటిల్ విన్నర్ అనుశ్రీ కి సత్కారం:: యువత మోడలింగ్ రంగంపై దృష్టి సారించాలని ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ మరియు తెలంగాణ 2022 టైటిల్ విన్నర్ అనుశ్రీ పిలుపునిచ్చారు. ఇటీవల విజయవాడ అమరావతి కన్వెన్షన్ సత్య టీమ్ ఆధ్వర్యంలో వెంకీ కొరియోగ్రఫీ చేసిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఏపీ మరియు తెలంగాణ 2022 సీజన్-4 పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా అనుశ్రీ ను స్థానిక పౌర గ్రంథాలయంలో ఉదయ్ కొల్లి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం తరఫున గ్లోబల్ స్థాయిలో మోడలింగ్ లొ రాణించి ఎక్కువ మంది యువతీ యువకులను మోడల్స్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిభ ఉన్న వారు ఆయా రంగాల్లో రాణించడానికి అవకాశం ఏర్పడింది అన్నారు. పశ్చిమ గోదావరిలో పుట్టిన తన విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలో పూర్తి చేశానని విశాఖపట్నం అంటే తనకు ఎంతో ప్రేమ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తనకు ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో 80 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అని ఇప్పటికే ఫ్రిడ్జ్ అనే సినిమా మరియు డ్రై డే వెబ్ సిరీస్ లో నటించానని అన్నారు. ఆగస్టు లో జరగబోయే మిస్ ఇండియా ఫైనాన్స్ లో సెలెక్ట్ అయ్యారని దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు అనంతరం వైజాగ్ ఐకాన్, ఈవెంట్ డైరెక్టర్ వీరు మామ మరియు న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ మంచా నాగమల్లేశ్వరి,ఉదయ్ కొల్లి,సురేష్ బాబు చేతుల మీదగా అనుశ్రీ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వీరు మమస్ వైజాగ్ కిడ్స్ ఫ్యాషన్ రన్వే,వైజాగ్ రాక్ సింగెర్స్ పోస్టర్ ఆవిష్కరణ అనుశ్రీ చేతులు మీదుగా జరిగింది.

