రహదారి ఆక్రమించి నిర్మాణం చేపడుతున్న చోద్యం చూస్తున్న అధికారులు.?
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి
భీమిలి నియోజకవర్గం జివియంసి జోన్ 2 పరిదిలో మధురవాడ 7 వ వార్డు దుర్గానగర్ డిల్లీ పబ్లిక్ స్కూల్ వీధిలో రహదారిని ఆక్రమించుకొని నిర్మాణం జరుగుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సచివాలయం మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎటువంటి ప్లాన్ లేకుండా రహదారి అక్రమించి జరుగుతున్న అక్రమ నిర్మాణం గురించి రోజు ఫీల్డ్ లో తిరిగే సచివాలయం సిబ్బందిని ఈ నిర్మాణం గురించి అడిగితే తెలియదని సమాదానం చెప్పి తప్పించుకుంటున్నారు ఇటువైపు నుండి ప్రయాణము చేస్తున్న ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్రమ నిర్మాణదారుడు ఉన్న 4 అడుగుల రహదారిలో ఇసుక, పిక్క అడ్డుగా వేయడం వలన ప్రమాదాల బారిన పడి కాళ్లు, చేతులు విరిగి ఆసుపత్రి పాలు అవుతున్నారు అని అంటున్నారు.ఈ రహదారి ఆక్రమించి కడుతున్న అక్రమ నిర్మాణం గురించి టిపివో ని స్థానికులు అడగగా దానికి ప్లాన్ ఉందని సమాధానము చెపుతున్నారు. ప్లాన్ ఉండి డిస్ ప్లే చేయకపోతే జివియంసి ఎంత ఫైన్ వేస్తారని అడుగగా మా ఇష్టం ఎంతైనా వేయ వచ్చని సమాధానము చెప్పడం కొసమెరుపు.జీవీఎంసీ టీపీవో, సచివాలయ సిబ్బంది రహదారిని అక్రమ కట్టడం పై వారు స్పందించిన తీరుబట్టి భారీగా ముడుపులు అందాయనే అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.ఇప్పటికైనా జివియంసి ఉన్నత అధికారులు ఈ అక్రమ నిర్మాణం పై తగు చర్యలు తీసుకుని రోడ్డుని కాపాడాలని ఈ అక్రమ నిర్మాణానికి సహకరిస్తు జివియంసి ఆదాయానికి గండి కొడుతున్న అధికారులను శిక్షించాలని స్థానికులు కోరుకుంటున్నారు.


