జనసేన నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన కిట్స్ పంపిణీ.
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల క్షేమం కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ
భీమిలి నియోజకవర్గo 5వార్డు జనసైనికులకు. క్రియశిల సభ్యుత్వం తీసుకున్న వారికీ జనసేన 5వార్డు నాయకులు
యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో.
జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్
డా"సందీప్ పంచకర్ల చేతులు మీదగా అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో డా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ
ప్రజా సమస్యలు పై పోరాడే వ్వక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ అధికారం లో లేకపోయినా ప్రజలు కన్నీరు తుడుస్తుంది అని
కౌలు రైతులు కుటుంబలకు 30 కోట్లు రూపాయలు ఇస్తున్న జనసేన పార్టీ లో ఉన్నందుకు మనం అందరూ గర్వపడాలి అని తెలియజేసారు
మధురవాడ పీ హెచ్ సి ని 30పడకల హాస్పిటల్ చేస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేసారు అని
గణేష్ నగర్ రోడ్డు ఎన్నో ఏళ్ళు గా అధ్వానంగా ఉన్న ఈ ప్రజాప్రతినిధులకు కనిపించలేదా అని ఏద్దేవా చేసారు,
జనసేన నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ 5&7వార్డు ప్రజలకు అన్నివిధాలా
ఉపయోగపడే పార్క్ ను ఎవ్వరు కి పనికిరాకుండా చేశారు అని అన్నారు.
అదే పార్క్ లో కల్యాణ మండపం కానీ గ్రంధాలయం కానీ పెట్టిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడేది అని అన్నారు
సందీప్ కి స్థానిక విద్యార్థి కంచుముర్తి హాని తమ సమస్య ను చెప్పుకుంది, అన్ని రంగాలలో అభివృద్ధి చేదుతున్న మధురవాడ లో గ్రందాలయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నం అని తెలియజేసింది, వెంటనే స్పందించినా
డా సందీప్ పంచకర్ల తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే గ్రంధాలయం ఏర్పాటుకి కృషి చేస్తాం అని, ప్రస్తుతంకి మీకు ఏ పుస్తకాలు అవసరమో చెపితే తాను ఇస్తాను అని హామీ ఇచ్చారు,
జనసేన నాయకులు బీవీ కృష్ణయ్య, శేఖరి శ్రీను బాబు, జనసేన మహిళల నాయకురాలు ఒమ్మి దేవి యాదవ్ మాట్లాడుతూ మహిళలు పై దాడులు పెరిగిపోయాయి అని విశాలమైన విశాఖపట్నం లో మహిళలు పై దాడులు జరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెత్త పన్ను వేసి ప్రజలు పై మరింత భారం వేసినా ఈ ప్రభుత్వంకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతాం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కుబీరెడ్డి ప్రసాద్, అనిల్ యాదవ్, కాకి ప్రకాష్, కోన వెంకట సాయి,శ్యామ్, సాయి వర్మ, హరీష్, దిలీప్, సాయి కృష్ణ, గణేష్, జేమ్స్, బసన శంకర్, రాజేష్, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

