వేములవలసలో "గంటా" హల్ చల్...!
ఆనందపురం:విశాఖ లోకల్ న్యూస్
మండలంలోని వేములవలస గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ మహోత్సవ వేడుకలకు మాజీ విద్యా శాఖ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై హల్ చల్ చేశారు. గంటా రాకతో గ్రామమంతా సందడి వాతావరణం కనిపించింది. పార్టీ కేడర్ అంతా ఉత్సాహంగా అతని వెంట పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించి అనంతరం క్యాడర్తో ఆయన మాట్లాడారు.రానున్నది టిడిపి ప్రభుత్వమేనని గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్టానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో గెలుపే ధ్యేయంగా ముందుకు పోవాలి అన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకు వెళ్లి వారిని జాగృతం చేయాలని సూచించారు. టీడీపీకి భీమిలి నియోజకవర్గం కంచు కోటగా మరోసారి నిరూపించాలని కోరారు. ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ అంతా సమాయత్తం కావాలని అన్నారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి అందరూ శ్రమించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు, వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఎమ్మెల్యే గంటాకు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు గంటా నూకరాజు,రెండవ వార్డు కార్పొరేటర్ గాడు అప్పలనాయుడు ,మాజీ సర్పంచ్ పాండ్రంకి అప్పలరాజు, ఎంపీటీసీ దొంతల కనకరాజు, కోరాడ వెంకటేష్ , బోధ నారాయణ అప్పుడు, కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు.

