ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి.

 ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి.

విశాఖ లోకల్ న్యూస్:

విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సమస్యలు తక్షణ పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ  శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.
ఈ సందర్బంగా ప్రజాదర్బార్ లో అనేక మత్స్యకార అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే ని సంప్రదించి న్యాయం చేయాలనీ కోరారు. అందులో భాగంగా
 (1) ఆఫ్కౌఫ్ మెంటేనేన్స్ చార్జెస్ తగ్గింపు లీటర్ కు ₹.1.50నుండి 0.84పైసలకు కొరకు అడిషనల్ డైరెక్టర్ అంజలి మేడం, అమరావతి తో మాట్లాడి
తక్షణమే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే వాసుపల్లి.
(2) ఫిషింగ్ హార్బర్ లో కరోనా సమయం లో ఐస్ ఫ్యాక్టరీ లకు రెంట్స్ మాఫీ చేయవలసిందిగా పోర్ట్ అధికారులను కోరడమైనది.
(3) 2019 సంవత్సరం కాలంలో 6నెలల ఆయిల్ సబ్సిడీ బకాయిలు మంజూరు చేయాలనీ కోరిన వెంటనే ఫిషరీస్ కమీషనర్ అమరావతి తో మాట్లాడి త్వరితగతినా న్యాయం చేయాలనీ కోరారు.
(4) విశాఖపట్నం లో ద్విచక్రవాహన మెకానిక్స్ కు ఐడి కార్డ్స్ మంజూరు చేసి, ఆర్ధిక సహాయం కొరకు లోన్స్ మంజూరు చేయాలనీ జీవీఎంసీ కమీషనర్ శ్రీ లక్ష్మి షాని కోరారు.
(5) ఫిషింగ్ హార్బర్ లో మత్తుపానియాలకు అలవాటు పడి అనేక నిరుద్యోగ యువతలు చేపల వెళ్లే వాళ్లదగ్గర నుండి భయపెట్టి విలువైన వస్తువులు, అమ్మకానికి దాచుకొన్న చేపలు దొంగిలించి భయబ్రాంతులకు గురుచేస్తున్నారని వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెట్రోలింగ్ చేయాలని నూతనంగా వన్ టౌన్ సీఐ గా జాయిన్ అయినా రేవతమ్మకి ఎమ్మెల్యే ఆదేశాలు జారిచేశారు.
ప్రజాదర్బార్ తలెత్తిన సమస్యలు వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గోవింద రావుని ఆదేశించారు.