విశాఖ లోకల్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్
ఎన్ డి ఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మ్ ఎంపిక
20 పేర్లు పరిశీలన తర్వాత మహిళకు అవకాశం ఇవ్వాలని భాజపా నిర్ణయం.,
రాష్ట్రపతి ఎన్నిక దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించి దూకుడు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. ఆదివాసి మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసి, దేశ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు.

