విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి
జనం కోసం సీపీయం పార్టీ గా ఇంటింటికి సర్వే కంచరపాలెం జోన్ నరేంద్ర నగర్, శివనగర్ లో జరిగింది. ఈ సర్వే లో వచ్చిన సమస్యలపై నరేంద్ర నగర్, గ్రీన్ గార్డెన్ సచివాలయాలకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. చెత్తకి కూడా పన్ను ఏమిటి? ఇది చెత్త ప్రభుత్వం అని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పధకాలు ఏదో నెపంతో ఆపివేస్తున్నారు. ఉదా : నరేంద్ర నగర్ లో ఒక పేద కుటుంబం ఇలా అన్నారు.మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు మేడ మీద ఉంటాడు. చిన్న కొడుకు మేము క్రిందన ఉంటాము. మాకు ఇప్పటి వరకు పెన్షన్ వచ్చేది. 2 మీటర్లు కి సంబందించిన కరెంటు యూనిట్స్ కలిపేసి 300 యూనిట్స్ దాటాయి. యూనిట్స్ పెరిగాయి మీరు డబ్బు వున్న వారు కనుక పెన్షన్ ఆపివేశారు.పేద కుటుంబ కాబట్టే పెన్షన్ ఇచ్చారు. ఇలా కరెంటు దొంగ లెక్క చూపించి పెన్షన్ ఎగ్గొట్టేసారు. గులాబ్ తుఫాన్ లో కూలి పోయిన స్మశానం గోడ ఈ రోజుకి నిర్మాణం జరగలేదు. స్మశానం గోడ అనుకోని నివాసం వుంటున్నారు. పాములు పందులు, కుక్కలు, చెత్తాచెదారం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఆ రోజు నుండి టెండర్లు కి పిలుస్తూనే వున్నారు జీవీఎంసీ వారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఇల్లు లేని వారు చాలా మంది వున్నారు. ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా ఇల్లు మాత్రం రావడం లేదు. కొంత మంది కి పట్టాలిచ్చారు. కాని స్థలం చూపించలేదు. చాలా మందికి పట్టాలు ఇవ్వలేదు. ఈ సమస్యలు మీద సచివాలయం లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కనుక సచివాలయం ద్వారా సమస్య లు పరిష్కరించాలని లేని యెడల భవిష్యత్ లో పెద్ద ఎత్తునప్రజలను కదిలించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు సీపీయం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి .పద్మ, పార్టీ నాయకులు ఎం. జయ లక్ష్మి, తెలుగు రమణ, ఎం. నాగేశ్వరావు, ఏ. పుష్ప స్థానికులు పాల్గొన్నారు.

