కలుషిత మంచినీటితో ఇబ్బందులు పడుతున్నా జ్ఞానపుర గ్రామ ప్రజలు,
విశాఖపట్నం, జ్ఞానపురం,41వార్డ్, జనసముద్రం న్యూస్,జూన్21,గతవారం రోజులుగా కలుషిత మంచినీటితో ఇబ్బందులు పడుతున్నట్లుగా జ్ఞానపుర ప్రాంత ప్రజలు చెబుతున్నారు,మొత్తం మంచినీళ్ళు బురద తో ఉంటున్నాయని దుర్గంధ భరితంగా ఉంటున్నాయని అక్కడి ప్రాంత ప్రజలు చెబుతున్నారు,ఈ నీటితో స్నానం చేసిన తరువాత చర్మం దురదమయంగా వుంటున్నదనీ చెబుతున్నారు,ఈ నీళ్లు వాడటం వలన ఉదరకోస సంభందిత రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు,పైప్ లైన్లు నిర్మాణం కోసం వీధులలో గోతులు తవ్వుతున్నరని దానివలన పైప్ లైన్లు ఎక్కడైనా లీక్ అయ్యి వుండవచ్చు ననే అనుమానన్ని ఈ ప్రాంత ప్రజలు కొందరు చెబుతున్నారు,,సంభందిత మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కలుషిత మంచినీటి సమస్య
నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు,,

