రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి చుక్కెదురు!
విశాఖ లోకల్ న్యూస్ :అమరావతి
మీసేవ సర్వీసులు పై సచివాలయాలకు నోటీసులు జారీ.
సచివాలయం నిర్వాహకులు ప్రజలకి సేవలందించడంలో నిరాశ కలిగించడంతో ప్రజలు మీ సేవకి మొగ్గుచూపుతున్నారు ఆ విషయం తెలిసిందే అయితే మీ సేవ సేవలు సచివాలయంలో చేయరాదని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు ధిక్కరణ కింద సచివాలయంలో అనుభవం లేని నిర్వాహకులతో పని చేస్తున్నారు దీంతో ప్రజలు మీసేవ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వం మొండిగా మీ సేవలో కొన్ని సేవలను ఆపే ప్రయత్నం కూడా చేసింది అయితే దీంతో విసిగిపోయిన మీసేవ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడంతో నేడు మీసేవల్లో సేవలు అందించరాదని ఆటంకం కలిగిస్తూ గ్రామ స్థాయిలో వి ఆర్ ఓ నుండి జిల్లా స్థాయిలో కలెక్టరు స్థాయి వరకు ఎదురవుతున్న సమస్యనుండి అలాగే మీ మీసేవల్లోనుండి కొన్ని సేవలను తొలగిస్తూ ఇబ్బంది పెడుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మీ సేవలకు అంతరాయం కలిగించే ఎటువంటి చర్య ఉండకూడదని ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్.,

