మీసేవా' కార్యకలాపాల్లో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు.అమరావతి (హైకోర్టు)
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
మీసేవా సెంటర్ల సేవల నిలిపివేతపై నిర్వాహకులు హైకోర్టును అశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మీ సేవా కేంద్రాలు అందించే సేవలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
★ రాష్ట్రంలో మీసేవా సేవల నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
★ ఈ మేరకు మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో జోక్యం వద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
★ మీ సేవా కేంద్రాలు అందించే సర్వీసులు నిలిపివేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
★ మీ సేవా కేంద్రాల తరఫున న్యాయవాది బేతి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
★ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు.
★ మీసేవా కేంద్రాలకు వచ్చే వారిని గ్రామ సచివాలయాలకు వెళ్లమనడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది వాదించారు.
★ ఈ చర్య.. మీసేవా నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకమన్నారు.
★ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. మీసేవా కేంద్రాల కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం వద్దని,సేవలు పునరుద్ధరించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

