మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 98 వర్ధంతి సందర్భంగా నివాళులు.

 మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 98 వర్ధంతి సందర్భంగా నివాళులు.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 98 వర్ధంతి సందర్భంగా మధురవాడ ఏరియా లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులను ఎన్నో ఇబ్బందులు పెట్టిన బ్రిటిష్ వారు గిరిజనులు పంటలు పండించుకునే ఆ పంటను గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పట్టుకెళ్ళి పోవటం బ్రిటిష్ వారు రోడ్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టులు గిరిజనులను పనులకు తీసుకెళ్ళి గిరిజనులకు డబ్బులు ఇవ్వని రూపంలో గిరిజనులు తిరగబడి అడిగితే వారిని కొట్టి బెదిరించి వారిని కూడా హింసించడం చేసేవారు ఇవన్నీ తెలుసుకొని అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులు దగ్గరికి వెళ్లి ఇంకెన్నాళ్లు ఈ బాధలు పడతారు మీరందరూ విల్లంబులు చేత పట్టండి అని చెప్పిన అల్లూరి సీతారామరాజు గారు కొంతమందికి సమీకరించి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేవారు పోలీస్ స్టేషన్లో వారికి ఉపయోగపడ సామాగ్రి మాత్రమే తీసుకెళ్లేవారు ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దర్శనం చేయకుండా వెళ్లేవారు విశాఖ జిల్లాలోని జన్మించి విశాఖ జిల్లాలోనే మరణించిన టువంటి అల్లూరి సీతారామరాజు కి పేరుపెట్టాలని సిపిఐ పార్టీ పోరాటంలో భాగమే ఇవాళ మన్యం జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారని అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి లను గవర్నమెంట్ వారు అధికారికంగా ప్రకటించాలని సిపిఐ పోరాటంలో భాగమే ఇవాళ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటిస్తారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కై అల్లూరు స్ఫూర్తితో పోరాడుతామని పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు తగ్గించడానికి అల్లూరు స్ఫూర్తితో పోరాడతామని కరెంట్ చార్జీలు ప్రజలపై వేషం చెత్త పన్ను రద్దు చేయాలని అల్లూరి సీతారామరాజు 98 వ వర్ధంతి సందర్భంగా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మధురవాడ సిపిఐ నాయకులు ఎస్కే బేగం, వి సత్యనారాయణ, కే మెగా రావు, జి వేలంగని రావు, కేశవయ్య, శ్యామ్ సుందర్ రెడ్డి, అప్పలనాయుడు, కావ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.