పెంచిన విద్యుత్ చార్జీలు మరియు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ.


 పెంచిన విద్యుత్ చార్జీలు మరియు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 10/05/2022

 విశాఖ :జోన్ 2, మధురవాడ,5వ వార్డు నగరంపాలెం లో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడరాజబాబు ఆదేశాలు మేరకు పెంచిన విధ్యుత్ చార్జీలు తగ్గించాలని 5వ వార్డు టీడీపీ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ అధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు గా నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడరాజబాబు,5వ వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత పాల్గొన్నారు.ఇంటి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంచి గత ప్రభుత్వంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలకు తేడా చెప్తూ అభివృద్ధి లేని ప్రభుత్వం అని వివరిస్తూ కవ్వొత్తులతో ర్యాలీ గా తిరుగుతూ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో, టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, జిల్లా కమిటీ సభ్యులు వాండ్రసి అప్పలరాజు,భీమిలి మహిళా నియోజకవర్గం సభ్యులు బోయి రమాదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.