నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ని, వారి భార్యను అరెస్ట్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేసిన ఆనంద్ బాబు గొల్లంగి!
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం
రాజ ధర్మం తెలిసిన, రాజకీయ పార్టీలు ఇలా చేయరాదు నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ని, వారి భార్యను అరెస్ట్ చేయడం బాధాకరమని ఆనంద్ బాబు గొల్లంగి ఆవేదన వ్యక్తంచేశారు. జీవీఎంసీ జోన్ టు 6వార్డ్ పోతినమలయ్య పాలెం సీనియర్ నాయకుడు రాష్ట్ర టీడీపీ బిసి సెల్ ఉపాధ్యక్షుడు ఆనంద్ బాబు పత్రిక ద్వారా టీడీపీ నేతల పై జరుగుతున్న అన్యాయానికి మాట్లాడుతూ 10-05-1997 వ సంవత్సరంలో ఇదే రోజు ఆక్సిడెంట్ లో ఒక్కగా నొక్క కొడుకుని, కోల్పోయి, కడు దుఃఖంతో ఉన్న నారాయణ విద్యా సంస్థల అధినేత 10-05-2022 మంగళవారం తన కుమారుడి వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్న సమయంలో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ని, వారి భార్యను అరెస్ట్ చేయడం బాధాకరం. రోజు రోజు కి ప్రజాభిమానం పొందుతున్న, టీడీపీ నాయకులపై అధికార పార్టీ ఈ విధంగా కక్ష సాధింపు తో ఎక్కడికి పోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఒక మంచి స్థాయిలో వున్న, వ్యక్తులు 10th క్లాస్ క్వశ్చన్ పేపర్స్ ను లీక్ చేసి, డబ్బును సంపాదించు కోవడం కోసం ఒక్క స్థాయిలో వున్న వ్యక్తి ఇలాంటి పని చేయరు. అధికార పార్టీలో ఉన్న నాయకులు కి కనీసం ఇంగిత జన్నాం కూడా లేకుండా కొడుకు వర్ధంతి రోజు దంపతులను అరెస్ట్ చేయడం, దారుణమని ఆనంద్ బాబు ఖండిస్తున్నాను అని తెలిపారు. విద్యా వేత్త, మరియు 2019 కి పూర్వ ప్రభుత్వం లో మంత్రి వర్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో విశేష కృషి చేసిన నారాయణరావు, వారి ధర్మ పత్నీ అరెస్ట్ ఖండనీయం అని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి మళ్ళీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గెలిపిస్తాము అని ముఖ్యంగా ఈ లికేజ్ కి బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి రాజీనామా చేయాలి లేదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన విద్యా శాఖ మంత్రి వర్యులను అరెస్ట్ చేయించి,విచారణ జరిపించాలి.లేదా వారి రాజీనామా కోరాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆనందబాబు గొల్లంగి రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు కోరుతున్నారు.

