సి ఓ సి సెంటర్ ద్వారా తుఫాను తీవ్రతను పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
కమాండ్ కంట్రోల్ సెంటర్ (సి.ఓ.సి.) ద్వారా తుఫాన్ తీవ్రతను పరిశీలించిన జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ. మంగళవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి బంగాళాఖాతంలో ఏర్పడిన “అసని” తుఫాన్ తీవ్రతను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలను ముంపుకు గురయ్యే ప్రాంతాలను సి.ఓ.సి. సెంటర్ ద్వారా పరిశీలించి, ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి జివిఎంసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, అధికారులందరూ ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, గెడ్డలు, కాలువలు పొంగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆదేశించారు. కొండవాలు ప్రాంత ప్రజలు ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు అత్యవసర పరిస్థితిలో సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గాలులు తీవ్రంగా వస్తున్న దృష్ట్యా రాబోయే 48 గంటలలో హోర్డింగులు, చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని, వాహనాలు జాగ్రత్తగా చెట్ల కింద ఉంచరాదని కమిషనర్ తెలియజేశారు.

.jpg)