హిజ్రాల సమస్య కోసం వినతి పత్రం

 హిజ్రాల సమస్య కోసం వినతి పత్రం 

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

విశాఖపట్నం వచ్చిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉషశ్రీ  చరణ్ మర్యాదపూర్వకంగా కలిసిన హెల్పింగ్ హేండ్స్ హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు దవడ కొండబాబు ఆధ్వర్యంలో భారతి నాయక్,సిల్కి నాయక్, రాజీ నాయక్,ఎల్లాజీ నాయక్ తదితరులు కలిసి హిజ్రా కమ్యూనిటీకీ ఉన్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు హిజ్రాలకు శ్వాసత గృహలు కల్పించాలని చదువుకున్న హిజ్రా కమ్యూనిటీ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హిజ్రా కమ్యూనిటీ కి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎన్నో మార్గాలు వారికీ కులాలు మతాలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మా హిజ్రా కమ్యూనిటీ కూడా ఆదుకోవాలని తండ్రికి తగ్గ తనయుడిగా మా మన్ననలు పొందాలని మాకు కూడా సమాజంలో మంచి గుర్తింపు తీసుకు వస్తారని మేము కూడా ఎవరికీ తక్కువ కాదని సంపాదించుకునే సంపాదనలో సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మంత్రివర్యులుని కొండబాబు  కోరారు ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు మాట్లాడుతూ త్వరలోనే మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తానని తప్పకుండా మీకూ సీఎం న్యాయం చేస్తారని న్యాయంమైన సమస్యలు పరిష్కారం చేయడంలో మన ముఖ్యమంత్రి వర్యులు వై. స్. జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంటారు అన్ని తెలియజేశారు.