న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ ను ప్రారంభించిన నగర మేయర్.
విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:
అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ తెలిపారు. శుక్రవారం ఆమె 3వ జోన్ 17వ వార్డు పరిధిలో ఎంవిపి కాలనీ సెక్టర్-1 లో బ్లడ్ సెంటర్ డైరెక్టర్ గోవిందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ ను ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేయుటకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా కాలంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చాలా బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేని పరిస్థితి ఏర్పడిందని ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా రక్త నిల్వలు ఈ బ్లడ్ బ్యాంకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకుల అన్ని గ్రూపుల వారికి అత్యవసర పరిస్థితులలో రక్త నిల్వలు వుండేటట్లు చూడాలని ఏ గ్రూపు బ్లడ్ కావాలన్న ఆ గ్రూపులో అందుబాటులో ఉంచుకుని విధంగా ఏర్పాటు చేసుకోవాలని డైరెక్టర్ కు సూచించారు.

