భీమిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అవంతి.

 భీమిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అవంతి.

విశాఖ లోకల్ న్యూస్: భీమిలి

భీమిలి మండలం రెవెన్యూ కార్యాలయం నందు నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయం ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రారంభించడం జరిగింది.మోదటి ఆర్డివో గా పదవీ బాధ్యతలు చేపట్టిన గారికి మంత్రి వర్యులు శుభాకాంక్షలు తెలిపారు, 

  అనంతరం మంత్రి వర్యులు మాట్లాడుతూ.... విశాఖ జిల్లా ను మూడు జిల్లాలుగా వికేంద్రీకరణ చేసిన సందర్భంగా విశాఖ జిల్లా లో నేను  శాసనసభ్యుడు గా రాష్ట్ర మంత్రి గా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని, గత ప్రభుత్వం లో ఇదే నియోజకవర్గం లో పలు ఆరోపణలపై అదికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇదే నియోజకవర్గం లో అదికారులు నిజాయితీ గా పని చేయడం తో ఎలాంటి అవినీతి కి తావులేకుండా ఉందని , జగనన్న కోలనీ ఇళ్ళు అర్హులైన వారందరికి ఇచ్చామే తప్పా ఎక్కడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా జరిగింది దీనికి అదికారులు నిజాయితీ పని చేసారని కొనియాడారు, గతంలో ఏదైనా పనులు మీద ఆర్డీవో కార్యాలయం కి భీమిలి , పద్మనాభం, అనందపురం మండలం నుండి వెళ్ళవలసిన అవసరం పడితే 40 కి.మీ దూరం ప్రయాణించవలసి ఉండేది ఇప్పుడు మనకి చేరువలో ఆర్డోవో కార్యాలయం రావడం అందరు హర్షించి ఆనందించదగ్గ విషయం ఈ విషయంలో మనం అందరం సియం జగన్మోహన్ రెడ్డి గారి కి ఎంతో రుణపడి ఉన్నామని కొనియాడారు. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు గారిని , జాయింట్ కలెక్టర్ గారిని, అసిస్టెంట్ కలెక్టర్ గారిని, ఆర్డీవో కిశోర్ గారిని  సన్మానించడం జరిగింది.... ఈ కార్యక్రమంలో యంఆర్వో లు, యంపిడీవో లు, జోనల్ కమిషనర్ లు, ప్రజాప్రతినిధులు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .