స్వయం శక్తి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన సి.ఈ.ఓ రోజా రమణి.

 స్వయం శక్తి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన సి.ఈ.ఓ రోజా రమణి.

విశాఖ లోకల్ న్యూస్: అరిలోవ:
జీవీఎంసీ అరిలోవ దుర్గ బజార్ కొలనిలో  స్వయం శక్తి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో   పగటిపూట ఉష్ణోగ్రత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ప్రారంభించారు.
ఈసందర్భంగా స్వయం శక్తి స్వచ్ఛంద సేవా సంఘం  సి.ఈ.ఓ రోజా రమణి మాట్లాడుతూ పగటిపూట ఉష్ణోగ్రత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పాదచారులు మరియు వాహన దారుల కోసం ఈ స్వయం శక్తి స్వచ్ఛంద సేవా సంఘం తరుపున చలివేంద్రం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు అలాగే ప్రతి ఒక్కరు  మూగజీవుల కోసం వన్య ప్రాణుల కోసం మీ ఇంటి పరిసరాల్లో  నీటిని ఏర్పాటు చేయాలని మా సేవా సంఘం తరఫున కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జ్యోతి, గురుమూర్తి,ధన లక్ష్మీ, పద్మ,పైడి రాజు,చందు, రాజు,దేవిగా, సుగుర, తదితరులు పాల్గొన్నారు.