మధురవాడ వాంబేకాలనీ లో రజకులను అడ్డంపెట్టుకుని భూకబ్జాకి ప్రయత్నం.!?

 మధురవాడ వాంబేకాలనీ లో రజకులను అడ్డంపెట్టుకుని భూకబ్జాకి ప్రయత్నం.!?

విశాఖ లోకల్ న్యూస్:

జీవీఎంసీ జోన్ టు మధురవాడ వాంబే కొలని 33 బ్లాక్.లో చెలపాక రమణ అనే వ్యక్తి రజకుల దోబీ కానా సంఘం పేరు చెప్పి స్థలాన్ని, నీటిని తన ఆధీనంలో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని అని స్థానిక ప్రజలు ఆరోపణ చేశారు.
వాంబే కొలని లో ప్రభుత్వం రజకుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి చూస్తే  స్థానిక రజకులు అడ్డుకున్నారు.  అలాగే లేని సంఘం పేరుతో నీటి  మోటర్ కూడా తన ఇంటికి అమర్చి నీరు కూడా ఎవరికీ చెందకుండా ఆయనే అనుభవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రజకుల కోసం ఏర్పాటు చేసిన ధోబి ని రజకులకు చెందకుండా అడ్డుపడుతున్నారని  స్థానిక రజకులు తెలుపుతున్నారు. ఈ సమస్యపై సచివాలయానికి తెలియజేయగా సచివాలయం సిబ్బంది వచ్చి అక్రమ దారులను అడ్డుకున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు జివిఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు,