మంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని తొలగించిన కబ్జాదారులు .? స్థానికులు అడగటం తో ఆస్థానంలో ఎవరికీ తెలియకుండా కొత్త శిలాఫలకాన్ని పెట్టిన కబ్జాదారులు.?

 మంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని తొలగించిన కబ్జాదారులు .?  స్థానికులు అడగటం తో ఆస్థానంలో ఎవరికీ తెలియకుండా కొత్త శిలాఫలకాన్ని పెట్టిన కబ్జాదారులు.?

విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:

పట్టించుకోని స్థానిక కార్పొరేటర్.


ప్రభుత్వ భూముల కబ్జాలకు గురవుతున్న వుడా, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు మధురవాడ సర్వేనెంబర్ 264, 263, పట్టాలు లేకుండానే ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు.. 8వ వార్డు పరిధి పాత మధురవాడ లో కళ్యాణ మండపం నిర్మాణం కోసం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా వేసిన శిలాఫలకం ఇప్పటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన శిలాఫలకం వేసి సుమారు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆ శిలాఫలకాన్ని ఇటీవల కాలనీలో గుర్తుతెలియని దుండగుల ధ్వంసం చేశారు.. మళ్లీ తిరిగి శిలాఫలకాన్ని  చోటా నాయకులు ఆ ప్రభావం వారి పై పడకుండా తిరిగి పునర్నిర్మాణం చేశారు. 8వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ కూడా పట్టించుకోవటం గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణం చేసిన ఈ శిలాఫలకం స్థానికంగా చర్చనీయాంశమైంది. శంకుస్థాపన చేసిన స్థలం వుడా కి చెందిన స్థలం కావడంతో ఆ స్థలాన్ని కాజేసేందుకు తప్పుడు పత్రాలతో వైసిపి నేత ఒకరు వుడా  భూమిని కబ్జా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే  శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల వుడా అధికారులు సర్వే చేస్తే ఆ ప్రాంతమంతా వుడా కు చెందిన గా గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిని మసి పూసి మారేడు కాయ లా ఓ కార్పొరేటర్ మాజీ మంత్రి పేరు చెప్పి వుడా భూమికి ఎసరు పెట్టేందుకు కృషి చేస్తున్నాడని అందుకు కార్పొరేటర్ ఆక్రమణదారుల కు అండగా నిలిచి ఎటువంటి పట్టాలు లేకుండానే లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు స్థానికంగా చర్చ జోరుగా సాగుతోంది. కార్పొరేటర్ అండదండలతోనే పాత మధురవాడ మెట్ట పై అక్రమాలు జరుగుతున్నాయి.8వ వార్డు లో వైస్సార్సీపీ కార్పొరేటర్ అయ్యి ఉండి చూసి చూడనట్టు ఉండటంతో కార్పొరేటర్ అండతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందిని అడగ్గా పైనుంచి ఒత్తుడులు ఎక్కువుగా ఉన్నాయని దాని కారణంగా మేమేమి చెయ్యలేకపోతున్నామని చేతులెట్టేస్తున్నారు. పేదల పేరుతో మధురవాడ సర్వేనెంబర్ 336 లోను అక్రమ నిర్మాణాలకు కార్పొరేటర్ అండగా నిలుస్తున్నాడు అని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు అడుగులకు మడుగులొత్తుతున్న వుడా రెవెన్యూ అధికారులు దొంగచాటున సర్వే చేసి మీడియాకు తెలియకుండా ఆక్రమణదారులు అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నా  తమపై పెద్ద పెద్ద వాళ్ళ ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో పట్టాలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు భారీ ఎత్తున చేస్తున్న  పట్టించుకోకపోవడం పట్ల వుడా రెవెన్యూ అధికారులకు ఎంత ముట్టాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ స్థలాల సెటిల్మెంట్లలో స్థానిక చోట నేతలు మున్నా సినిమా ను తలపించేలా మాజీ మంత్రి పేరు చెప్పుకొని తమ హవా నడిపిస్తున్నారు. కాలనీలో సుమారు 1000 గడప ఉంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈ కాలనీలో  వివాహాలు చేసుకోవడానికి చిన్న కళ్యాణ మండపం కూడా లేకపోవడంతో స్థానికులు అభ్యర్థన మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం  కళ్యాణ మండపం నిర్మాణానికి అప్పటి మినిస్టర్ ముత్తంశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇది  ఇంత వరకు నిర్మాణానికి నోచుకోలేదు. సరే దాని కోసం కేటాయించిన స్థలం ఆక్రమణదారులు నుండి రక్షించ కుండా వారిని ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.పాతమధురవాడ లో సుమారు 1000కి పైగా గృహాలు ఉన్నాయని వారికి కల్యాణమండపం అవసరమని అప్పటి మంత్రిగా ఇప్పటి ఎక్స్ మంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయ్యింది. కళ్యాణమండపం కొరకు ఏ ఈ ని అడగ్గా కాంట్రాక్టర్ లు ముందుకు రాకపోవటం తో కల్యాణమండపం కట్టే ఆలోచన చెయ్యలేదనే సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగ పడాల్సిన ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు, జీవీఎంసీ అధికారులకు లేదా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి వేసిన శిలాఫలకాన్ని మాజీ మంత్రి అయ్యేసరికి ఆపార్టీ చోటానాయుకులే తొలగించేయటం ఆశ్చర్యానికి గురవుతున్న స్థానికులు. స్థానికులడిగేసరికి కొత్త శిలాఫలకాన్ని వారే స్థాపించేశారని తెలుపుతున్నారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంలో ఆ పార్టీ నేతల హస్తం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇది అవంతి కి అవమానమే జరిగినప్పటికీ కక్కలేక మింగలేక ఉన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్యాణ మండపాన్ని త్వరగా నిర్మాణం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.