స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా బీచ్ రోడ్ లో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన నగర మేయర్ .
విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ ప్రతినిధి.
విశాఖపట్నం ఏప్రిల్ 3:- ఆధార్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన ర్యాలీ ని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ కలిసి జెండా ఊపి ప్రారంభించారు.ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ కాళీమాత మందిరం నుండి వైయస్సార్ విగ్రహం వరకు స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన సైకిల్ ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో మొదటి ర్యాంకె లక్ష్యంగా పని చేయాలని అందుకు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాలవారు, ఎన్జీవోస్, నగర పౌరులు, విద్యార్థులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛత పై నగర ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే చాలా వరకు మూడు రంగుల చెత్త బుట్టలు పంపిణీ చేశామని, తడి పొడి మరియు హానికరమైన చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదకరమైన ప్లాస్టిక్ బ్యాగులను విడనాడి నారా, గుడ్డ సంచులను ఉపయోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు తడి చెత్త తో సేంద్రియ ఎరువు తయారీనీ ప్రోత్సహించాలని తెలిపారు. వార్డులలో కాలువలు రోడ్లు శుభ్రత, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ప్రతి విషయంలో జాగ్రత్త వహించి త్వరలో రానున్న స్వచ్ఛ సర్వేక్షన్ బృందానికి విశాఖ నగరం అంటే స్వచ్ఛతకు మారుపేరు అని అనిపించేలా ఉండాలని అధికారులకు సూచించారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో నగర పౌరులకు, విద్యార్థులకు అవగాహన కల్పించి ఓటింగ్ శాతాన్ని పెంచాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ' క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ ' లో భాగంగా నగరానికి చెత్త తరలించే వాహనాలను సమకూర్చారని వాటి ద్వారా తడి - పొడి మరియు ప్రమాదకరమైన చెత్తను ప్రతి ఇంటి నుండి సేకరించి డంపింగ్ యాడ్ కి తరలించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతి వార్డు లో ఒక పార్కు, ఓపెన్ జిమ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో గత సంవత్సరం కంటే ఈ ఏడాది మొదటి ర్యాంకు సాధించాలని అందుకు అందరి సహకారం అవసరమని ముఖ్యంగా నగర పౌరులు పారిశుద్ధ కార్మికులు కృషి ఎనలేనిదని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ కొరకు కమిషనరు, మేయర్, డిప్యూటీ మేయర్ లు కార్పొరేటర్లు శాసనసభ్యులు జీవీఎంసీ యంత్రాంగము ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ పై అవగాహన కోసం ఈ సైకిల్ ర్యాలీని ప్రారంభించామని ,స్వచ్ఛ సర్వేక్షణ లో మెరుగైన ర్యాంక్ కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో వచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ బృందానికి నగర స్వచ్ఛత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారుల నుండి పారిశుద్ధ కార్మికుల వరకూ వారి పరిధిలో ఉన్న కాలువలు, కల్వర్టులు, రోడ్లు ,ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయకుండా అవగాహన ప్రజలకు కల్పించాలని, బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో ప్రస్తుతం మనమే ముందంజలో ఉన్నామని ఈ ముందంజ ను ఇదేవిధంగా కొనసాగించాలని అందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ విషయంలో పౌరులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛ సర్వేక్షన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అందులో అన్ని ప్రశ్నలకు సరి అయిన జవాబులు పెట్టాలని తెలియజేశారు. తడి - పొడి చెత్త సేకరణ, సేంద్రియఎరువు ,చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ,పార్కుల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు మౌలిక వసతులు త్రాగునీటి వంటి అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలతో మమేకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు లేదా నారా సంచులను ఉపయోగించాలని నగర ప్రజలకు సూచించారు. ప్రతి దుకాణదారులు చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీఐజీ రంగారావు , డిప్యూటీ మేయర్ లు జియాని శ్రీధర్, కట్టమూరు సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లు, కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ వై. శ్రీనివాసరావు, జివిఎంసి అధికారులు ఇతరులు పాల్గొన్నారు.