టీటీడీ దేవాలయంనకు విచ్చేసిన హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.

 టీటీడీ దేవాలయంనకు విచ్చేసిన హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి   మనోహర్ లాల్ ఖట్టర్.

విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:

విశాఖపట్నం టీటీడీ దేవాలయంనకు ఆదివారం విచ్చేసిన హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి   మనోహర్ లాల్ ఖట్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, మౌలిక వసతులు,పెట్టుబడులు  ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ వీరికి విశాఖపట్నం టీటీడీ దేవాలయ ప్రధానర్చకులు వేదమంత్రాలు, వాయిధ్యాలతో స్వాగతం పలికి దేవాలయ దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి దుషాలువాలతోసత్కరించారు.
ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర పరిశ్రమల, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులమీదుగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి   మనోహర్ లాల్ ఖట్టర్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ దేవాలయ సిబ్బంది మరియు అన్నమాచార్య సేవ సంగమ్ డిస్టిక్ కో ఆర్డినేటర్ కొఠారి సునీత సేవ సంగమ్ కమిటీ సభ్యులు తదితర పాల్గొన్నారు.