తిప్పల జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్.

 తిప్పల  జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్.

విశాఖపట్నం ఏప్రిల్ 1:- వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పల గురుమూర్తి రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నగర  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. శుక్రవారం ఆమె గాజువాక మింది గ్రామంలో ఆయన స్వగ్రామము నందు ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు గురుమూర్తి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పదిమందికి మంచి చేసే వ్యక్తిత్వం ఉన్న గురుమూర్తి రెడ్డి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు, ఇతర వైయస్సార్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.