39వార్డ్ లక్ష్మీ టాకీస్ బస్ స్టాప్ వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గారు నిర్వహించిన ప్రజాదర్బార్ కి విశేష ఆదరణ.
విశాఖ లోకల్ న్యూస్:
39వార్డ్ లక్ష్మీ టాకీస్ వద్ద ప్రజాదర్బార్ లో డా" జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గారు :
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీ టాకీస్ బస్ స్టాప్ దగ్గర లో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజాదర్బార్ లో అనేక మంది ప్రజలు విచ్చేశారు.
ప్రజాదర్బార్ లో భారత్ మాజీ ఉప ప్రధానమంత్రి డా" జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ 1977 నుండి 1979 వరకు అతను భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఒక సభ్యుడు అని కొనియాడారు. తరువాత అతను నెహ్రూ క్యాబినెట్ లో కమ్యూనికేషన్స్ (1952-56), రవాణా, రైల్వేలు (1956-62), రవాణా, కమ్యూనికేషన్స్ శాఖలకు (1962-63) లో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించాడు.
ఇందిరాగాంధీ ప్రభుత్వంలో, అతను కార్మిక, ఉపాధి, పునరావాసం మంత్రిగా (1966-67), కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా (1967–70) పనిచేశారు.
1936 నుండి 1986 వరకు పార్లమెంటులో అతని నిరంతర ప్రాతినిధ్యం ప్రపంచ రికార్డుగా గణతికెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 1946లో డా" జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా, భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశారని గుర్తు చేశారు.
తదుపరి అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జగ్జీవన్ రామ్ 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు.
తదుపరి నిరుద్యోగ యువకులు జాబ్స్ కల్పించాలని, పెన్షన్స్ కొరకు, పాడైన రోడ్లు, కాలువలు పునఃనిర్మాణం కొరకు, అంగనవాడి భవనాలు పునరుద్ధరణ కొరకు వినతి పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు 35వార్డ్ ప్రెసిడెంట్ కనకరెడ్డి, సౌత్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ముజేబుఖాన్, స్టేట్ నాయకులు ఆదివిష్ణు, సీనియర్ నాయకులు బాపు ఆనంద్, సిటీ సెక్రెటరీ పాలా శ్రీహరిరెడ్డి, రామానంద్, కోన శంకర్, దసమంతుల చిన్ని, కడియం ప్రసాద్, బాబ్జి, మైలపిల్లి ఆదినారాయణ, వాసుపల్లి నారాయణ రావు, చింతకాయల వాసు, సాగర్, రామరాజు, సారిపల్లి, కార్యకర్తలు పాల్గొన్నారు.