36వార్డ్ జామియా మసీదు వద్ద ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే వాసుపల్లి.

 36వార్డ్ జామియా మసీదు వద్ద ప్రజాదర్బార్ లో  ఎమ్మెల్యే వాసుపల్లి.

విశాఖపట్నం ప్రతినిధి:

విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 36వార్డ్ జామియా మసిద్, ఏ.వి.ఎన్ దగ్గర లో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్స్ ధరించి నిర్వహించిన ముస్లిం ప్రజాదర్బార్ లో అనేక మంది ప్రజలు విచ్చేశారు. 
 ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజాదర్బార్ కి ప్రజలు విశేష ఆదరణ లభిస్తోంది .
ఈ ప్రజాదర్బార్ లో మహారాణిపేట మండల కార్యాలయానికి MRO గా  ట్రాన్స్ఫర్ లో విచ్చేసిన రామారావు ఎమ్మెల్యే ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ముఖ్యoగా నియోజకవర్గ పరిధిలోని పెన్షన్ రాని అవ్వలకు ఆర్ధిక సహాయం చేసారు, కొంత మంది కి ఇల్లు స్థలాలు రాలేదని వినతిపత్రం
సమర్పించిన వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.
మరియు సీఎం నిరుపేదల అభ్యున్నతికి చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వారికి అన్నీ చేరే విదంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని కోరారు.
మరియు రెండవ దఫా ఇళ్ళు పట్టాలు మంజూరు చేయాలని, జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు చేపట్టాలని వైస్సార్సీపీ నాయకులకు ఆదేశించారు.
ముఖ్యoగా  పెన్షన్స్, కొరకు దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల14న భారత రాజ్యాంగ ప్రధాత డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి కి సంబరాలు కొరకు ఎమ్మెల్యే వారికి ఆహ్వానాలు అందజేశారు.