కాలువలు సైతం మూసేసి అక్రమ కట్టడాలు.

 కాలువలు సైతం మూసేసి అక్రమ కట్టడాలు.
అధికార నాయకులు అనే భయంతో  చూసి చూడనట్టు వెళ్లిపోతున్న సచివాలయ సిబ్బంది.

జోన్ టు, మధురవాడ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో వైస్సార్సీపీ నాయకుల కు అడ్డు అదుపు లేకుండా పోతుంది అని కాలనీలో లో స్థానికులు అంటున్నారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతో మారికవలస జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ లో అక్రమ కట్టడాలు చోద్యం చూస్తున్న సచివాలయ టౌన్ ప్లానింగ్ జీవీఎంసీ సిబ్బంది.కాలవలను సైతం ఆక్రమించి జోరుగా కట్టడాలు నిర్మిస్తున్నారు. చోద్యం చూస్తున్న స్థానిక సచివాలయ సిబ్బంది.సచివాలయ సిబ్బంది అధికార పార్టీ వారు కావటంతో వారికి కనిపించినట్టు వెళ్లిపోతున్నారని అని అన్నారు.
కాలువలు మూసేసి ఇల్లు నిర్మించేస్తుంటే ఎక్కడ అయినా చెత్త అడ్డుపడితే కాలువ నిండి పోయి రోడ్లపైకి వచ్చేసే ప్రమాదముంటుందని అంటున్నారు. అధికారులు స్పందించి కాలువ అక్రమ కట్టడాన్ని అపాలని స్థానికులు కోరుతున్నారు.