రాష్ట్ర ముఖ్యమంత్రికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం

పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు.

విశాఖపట్నం : వి న్యూస్:  నవంబర్ 01 :- 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విశాఖ‌ప‌ట్ట‌ణం ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంద్ర జిల్లాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం వాయు మార్గం ద్వారా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి 11:20 గంట‌ల‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస‌రావు, గ‌ణ‌బాబు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, జాయింట్ కలెక్టర్ మ‌యూర్ అశోక్, ఆర్డీవో పి. శ్రీలేఖ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా 11:35 గంట‌ల‌కు ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి శ్రీకాకుళం పయనమయ్యారు.