ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత.

ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 01:

*మధురవాడ* : పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. శుక్రవారం 5వ వార్డ్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ అని,లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనబడుతూ ఉందని, ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని అన్నారు. వికలాంగులు,వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనో ధైర్యం కల్పిస్తోందని హేమలత తెలిపారు. ఈకార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.