కంగువా' చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖలో సందడి చేసిన హీరో సూర్య

కంగువా' చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖలో సందడి చేసిన హీరో సూర్య
విశాఖ : వి న్యూస్ : అక్టోబర్ 27: 
కంగువా సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. వైజాగ్ కాంగువా మీట్ పేరిట విశాఖలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కే వీ ఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా కంగువ సినిమా నిర్మించారు.
సూర్య హీరో గా , దిశా పటాని హీరోయిన్ గా ,శివ దర్శకత్వంలో నిర్మాతలుగా వంశీ, ప్రమోద్, కె.ఈ. జ్ఞానవేల్ రాజా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రం *కంగువా* చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆదివారం హోటల్ నోవాటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో సూర్య, నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజా, నటుడు అవినాష్, పాల్గొన్నారు.