వాంబే కాలనీ అన్నా కాంటీన్ లో భీమిలి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల జన్మదిన వేడుకలు.
వాంబే కాలనీ : వి న్యూస్ : అక్టోబర్ 26:
భీమిలి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల జన్మదిన వేడుకలు ఏడవ వార్డ్, వాంబేకాలనీలో చాలా ఘనంగా నిర్వహించారు. వాంబే కాలనీ అన్నా కాంటీన్ లో మూడు పూట్ల ఉచిత భోజనం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ ప్రధాన కార్యదర్శి బీవీ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏడవ వార్డ్ అధ్యక్షులు నాగోతి నరసింహనాయుడు పర్యవేక్షణలో ఉదయం 400మందికి టిఫిన్ మధ్యాహ్నం 250, రాత్రి 200మందికి శనివారం మూడు భోజనం పెడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా శనివారం భీమిలి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న భీమిలి, చిట్టివలస, మారికవలస, వాంబే కాలనీలో నాలుగు కాంటీన్లలో ఉచిత భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముందుగా పేదలకు అల్పాహారం వడ్డీంచి అనంతరం జనసైనికులు ఏర్పాటు చేసిన కేక్ ను పేదల మధ్యలో కట్ చేసారు. అనంతరం భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ నాకు జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపి రాష్ట్ర జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ విశాఖ రూరల్ జనసేన కార్యదర్శి బీవీ కృష్ణయ్య, 7వ వార్డ్ జనసేన అధ్యక్షులు నాగోతి నరసింహనాయుడు ఆధ్వర్యంలో నేడు పేదలకు మూడుపూటలా కడుపు నింపే కార్యక్రమం వాంబేకాలనీ అన్నాకాంటీన్ లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పేకెటి శ్రీను, పోతిన తిరుమల రావు, సూర్య, త్రినాధ్, అనురాధ, సతీష్, ఉదయ్, స్వాతి సౌండ్స్ శ్రీను, సంతోష్ నాయుడు, వెంకటేష్, అక్షయ్ తదితర జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు.


.jpeg)
