మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా ప్రత్యేక సదస్సు
సమాచార సాంకేతిక రంగం అభివృద్దితో పాటు సామాజిక వేధికల ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 28వ తేదీన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నట్లు గీతం మహిళా సాధికారిక విభాగం ఛైర్ పర్సన్ డాక్టర్ వి.బి.శ్రీవిద్య తెలిపారు. టెక్ మాంత్రిక్ ఐటి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత తో పాటు స్త్రీ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్ లతో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఐటి రంగ నిపుణులు హజరై ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమ వ్యాఖ్యాత గా స్వర్గీయ మెాక్షగుండం విశ్వేశ్వరాయ మునిమనుమడు ఎమ్.జె.శ్రీకాంత్ వ్యవహరిస్తారని వెల్లడించారు. సదస్సులో ప్రధానంగా డీప్ ఫేక్ , మెుబైల్ హ్యకింగ్, సోషల్ మీడియా దుర్వినియెాగం, స్పై కెమెరా ద్వారా మహిళల వేధింపులు వంటి అంశాలపై పోలీసు అధికారులు, ఐటి రంగ నిపుణులు చర్చిస్తారని పేర్కొన్నారు.
