ఇకపై రెండు గంటల్లోనే ఈ పరీక్ష
IND: వి న్యూస్ : July 11:
ఇప్పటివరకు టోఫెల్ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే పూర్తయ్యేలా నిర్ణయించినట్లు టోఫెల్ సంస్థ గ్లోబల్ హెడ్ ఒమర్ చిహాన్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నదే తమ లక్ష్యమన్నారు. భారత్ నుంచి ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని.. 2030నాటికి అది 5లక్షలకు చేరే అవకాశాలున్నట్లు ఒక మీడియా సంస్థకు తెలిపారు.

