శివాలయం విగ్రహల ధ్వంసంపై పోలీసుల దర్యాప్తు..!పాల్పడిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్

శివాలయం విగ్రహల ధ్వంసంపై పోలీసుల దర్యాప్తు..!పాల్పడిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్             

ఆలయం పెద్ద గడ్డ పరిసరాల్లో పోలీస్ పహారా..!!

పాచిపెంట


:వి న్యూస్ : డిసెంబర్ 26.: 

క్రైస్తవులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హిందువుల మనోభావాలపై తీవ్రంగా దాడి చేశారు. పాచిపెంట మండల కేంద్రంలో పూర్వం దేవతలు నిర్మించి నట్లు చెబుతున్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రాతి దేవాలయం విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం ముంగిట భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించుకున్న ఆలయం ముంగిట మహానంది విగ్రహాన్ని దుండగులు తొలత ధ్వంసానికి పాల్పడ్డారు. మహానంది కళ్ళను బండరాలతో మోదీ చిందరవందర చేశారు. అలాగే నంది విగ్రహ తోకను చిదిమేశారు. అంతటితో ఆగకుండా ఆలయ ప్రాంగణం లోపలకు ప్రవేశించి గోడలపై ఉండే బృంగి, శృంగి విగ్రహాల అవయవాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. ఇటీవల భక్తుల వద్ద సేకరించిన లక్షలాది రూపాయల వ్యయంతో ఆలయ సుందరీకరణ పనులు చేపట్టారు. దేశంలో గల వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులను ప్రతిమలను, సోమనాథ్, తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి సేకరించి తెచ్చిన శివలింగాలను ఆలయం వెలుప భాగంలో గల చుట్టూ అమర్చారు. వాటిని కూడా కొన్ని పాక్షికంగా ధ్వంసం చేయగా ఒక శివలింగాన్ని ఎత్తుకుపోయారు. మరో చిన్న లింగాన్ని అక్కడే పారవేశారు. ఈ ఘటనపై మంగళవారం తెల్లవారుజామున ఆలయ పరిచర్యకులు యధావిధిగా వచ్చి చూడగా ద్వంశమైన తీరు దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు తెలిపారు. ఈ విషయం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు తెలియజేయడంతో ఈ సమాచారం భక్తుల వరకు వ్యాప్తి చెందింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు ప్రచురణ కావడంతో శైవ దైవ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా పాచిపెంట మండల అధ్యక్షురాలు బి ప్రమీల, స్థానిక ఎంపీటీసీ దండి ఏడుకొండలరావు, వైస్ ఎంపీపీ కోరిపల్లి రవీంద్ర, వైసిపి నాయకుడు ఎంపీపీ ప్రతినిధిపాచిపంట వీరమనాయుడు, వైసీపీ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొట్టాపు ముత్యాల నాయుడు, వైసిపి నాయకుడు కోటికి పెంట మాజీ సర్పంచ్ ఇజ్జాడ తిరుపతిరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు నడిపిల్లి రమేష్, పల్లెడ సత్యనారాయణ పల్లి పోలిరాజు, పూసర్ల శివ, సేనాపతి బాబురావు తదితరులు చేరుకొని పరిశీలించారు. అనంతరం సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ధనుంజయ్ రావు ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసం అయినా విగ్రహాలు, శివలింగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐ తెలిపారు. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి అతి సమీపంలో ఉన్న పెద్దగడ్డ ప్రాజెక్టు పరిసరాల్లో సాయంత్రం వేళల్లో మద్యపానం సేవించేందుకు కొంతమంది తరలి వస్తూ ఉంటారని అందువల్ల అరాచక కార్యక్రమాలకు అవకాశం కలుగుతుందని అలాంటి చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరి పైన కేసు నమోదు చేసి శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు . విగ్రహాల పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు చెబుతూ భక్తులెవరు ఆందోళనకు గురికా వద్దని కోరారు.