ఎంఎల్ఎ కి కృతజ్ఞతలు తెలిపిన - మధురవాడ అఖిలపక్ష నాయకులు.
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 28:
మధురవాడ పి ఎ సి ఎస్ భవన సముదాయం కూల్చివేసి పెట్రోల్ బంక్ పెట్టాలన్న సహకార శాఖ అధికారులు నిర్ణయం పట్ల సంఘం సభ్యులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని , అధికారులు పిలిచి గట్టిగా మందలించి ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు చెయ్యవద్దని చెప్పానని ఆ ప్రతిపాదన ఆగిపోయినదని సంఘం సభ్యులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం మధురవాడ అఖిలపక్ష నాయకులు ఎంఎల్ఎ ని వారి ఇంటివద్ద కలిసి సత్కరించి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మీరు మా శాసనసభ్యులు లుగా మా సంఘం పట్ల చూపించిన చొరవకు ధన్యవాదములు తెలిపారు. అందుకు స్పందించిన ఎం ఎల్ ఎ ప్రజలకు, సంస్థలకు నష్టం వాటిల్లే నిర్ణయాలు పట్ల నేను పూర్తిగా ప్రజల పక్షాన నిలబడతానని తెలిపారు.
ఎం ఎల్ ఎ ని కలిసిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, వైసీపీ నాయకులు పి కృష్ణ మూర్తి పాత్రుడు, పి హనుమంతురావు, కుడితి రామారావు, వి సన్యాసిరావు,జగపిళ్లి అప్పలరాజు, పి మూర్తి బాబు, టీడీపీ నాయకులు పి ఎల్లం నాయుడు పి విలేకరి నరసింగరావు, పి ప్రసాద్, ఎన్ ప్రకాష్, పి ఉమా, బి పైడిరాజు, సిపిఎం నాయకుడు ఎస్ పైడితల్లి తదితరులతో పాటు పలువురు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
