తూర్పుకాపు జాతి అభివృద్ధికి రాష్ట్ర తూర్పుకాపు వర్తకుల సంక్షేమ సంఘం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. తూర్పుకాపు వర్తకుల అధ్యక్షులు యువనేత గంటెడ మోహన్ కుమార్

తూర్పుకాపు జాతి అభివృద్ధికి రాష్ట్ర తూర్పుకాపు వర్తకుల సంక్షేమ  సంఘం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. తూర్పుకాపు వర్తకుల అధ్యక్షులు యువనేత గంటెడ మోహన్ కుమార్

విజయనగరం : వి న్యూస్ : నవంబర్ 28:

దాదాపు 2000 మంది సభ్యులు కలిగిన తూర్పుకాపు వర్తకుల సమాఖ్య విజయనగరం జిల్లాలో రెండవ సమావేశం స్థానిక మెసోనిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగ అధ్యక్షులు యువనేత గంటెడ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగ పల్సస్ గ్రూప్ అధినేత డాక్టర్ గేదెల శ్రీను బాబు హాజరు అయ్యి తూర్పుకాపు జాతి అభివృద్ధి కై ముఖ్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. అందులో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, డిజిటల్ మార్కెటింగ్‌ తో ఉత్త‌రాంధ్ర‌లో వ్యవసాయ వ్యాపార విప్లవం ప్ర‌తిభ‌ను పెంపొందించ‌డం ద్వారా బంగారు భ‌విష్య‌త్తుకి బాట‌లు,వెయ్యి మంది పారిశ్రామిక‌వేత్త‌లు, 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌తో ఉత్త‌రాంధ్ర అభివృద్ధి,విజన్ ఫర్ ఆంధ్రాస్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ వంటి ముఖ్యమైన విషయాలు ప్రతిపాదించారు. ఈ సదస్సులో రాష్ట్ర తూర్పుకాపు ముఖ్య నేతలు గురాన అయ్యలు  , కోట్ల సుగుణాకర్ రావు  ,రాష్ట్ర యువజన అధ్యక్షులు సేపేనా శ్రీనుబాబు,మామిడి గోవింద,జమ్ము.ఆదినారాయణ,లోపింటి.చిరంజీవి తదితరులు పాల్గొని తూర్పుకాపులు బిజినెస్ లో పరస్పరం సహకరించుకోవాలని చైతన్యవంతమైన ప్రసంగాలు చేశారు,విజయనగరం తూర్పుకాపు సామాజికవేదిక పూర్వపుఅద్యక్షులు మజ్జి.అప్పారావుగారు,మహంతి.క్రిష్ణమోహన్,తూర్పుకాపు ఉద్యోగుల సంఘం నాయకులు మిర్తిరెడ్డి.రామసింహచలం,మండల.శ్రీరామమూర్తి,మీసాల.నాగేశ్వరరావు,ఆర్లే.క్రిష్ణారావు,మొయిద.హనుమంతురావు,దన్నాన.తిరుపతిరావు,మహంతి.రమణ,వావిలపల్లి.సత్యన్నారాయణ,పిసిని.సత్యన్నారాయణ,రెడ్డి.శ్రీను,గేదెల.శంకరరావు,డా"బొంతు.రామునాయుడు,గొర్లె.పద్మావతి,రౌతు.గోపి తదితరులు మరయు అనేకమంది తూర్పుకాపు వర్తకసంఘం సబ్యులు పాల్గొన్నారు..కార్యక్రమం చివరలో ప్రముఖులను చిరుసత్కరించారు.