కలానగర్లో మలేరియా, డెంగీ వ్యాధుల నివారణ చర్యలను అవగాహనా ర్యాలీ నిర్వహించిన జోన్ 2 మలేరియా సూపెర్వైసర్ బేబీరాణి.

కలానగర్లో మలేరియా, డెంగీ వ్యాధుల నివారణ చర్యలను అవగాహనా ర్యాలీ నిర్వహించిన జోన్ 2 మలేరియా సూపెర్వైసర్  బేబీరాణి.                    

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి (నవంబర్ 10):

డెంగ్యూ మలేరియా వ్యాధుల నివారణ కొరకు తీసుకోవలసిన తగిన  జాగ్రత్తలు ఫ్రైడే డ్రై డే జీవీఎంసీ 7వ వార్డ్ మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆదేశాలతో జీవీఎంసీ సిబ్బంది నవ్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల, కలానగర్, వద్ద అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ్య భారతి ఈ ఎమ్ పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు, మలేరియా, డెంగీ దోమల పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాలను  మలేరియా సూపెర్వైసర్  బేబీరాణి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 2 మలేరియా సిబ్బంది ,ఆశా వర్కర్లు, సచివాలయం శానిటేషన్ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.