శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ:-

కొమ్మది: వి న్యూస్ : సెప్టెంబర్ 16:

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ మండలంలో 5 వవార్డ్ కొమ్మది సాయి రాం కాలనీ లో 16-9-2023 శనివారం సాoత్రo 5 గంటలకు బిజేపి మధురవాడ మండల అధ్యక్షులు బండారు అనీల్ కుమార్ అధ్యక్షతన శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్:- బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ అందించిన వినాయకుని మట్టి ప్రతిమలు అందరికీ ఉచితంగా పంచడం జరిగింది.ఈ కార్యక్రమం ఉద్దేశించి మధుర వాడ మండల అధ్యక్షులు బండారు అనిల్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చాలా శుభ పరిణామాన్ని అని అన్నారు, మధుర వాడ మండల ఉపాధ్యక్షులు దoడు రామక్రిష్ణ రాజు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల నదులు సముద్రాలు చెరువులు లో ఉన్న  నీరు కలుషితం కాకుండా కాపాడగలమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;- మధుర వాడ 7 వ వార్డు అధ్యక్షులు గొట్టిపల్లి అప్పారావు,మధుర వాడ మండలఉపాధ్యక్షలు రమేష్ శర్మ విశాఖ జిల్లా మైనార్టీ మోర్చా కార్యదర్శి బాజిత్ బేగ్,బిజేపి నాయకులు సత్యనారయణ రాజు,గణేశ్,మురళీ పి.రాజెo రాజు మరియు బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.