రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: నారా బ్రాహ్మణి.
ఏపీ :వి న్యూస్ :సెప్టెంబర్ 16:
42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను జైలులో పెట్టారు – చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు – చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగుకోసం కష్టపడేవారు – రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? – ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు – జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు – న్యాయ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది – ఇలా జరుగుతుందని మేం ఎప్పుడూ ఊహించలేదు – యువతకు ఉపాధి కల్పించడమే చంద్రబాబు చేసిన తప్పా? – చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది – చంద్రబాబు, లోకేశ్ కు వస్తున్న మద్దతు చూసే ఇదంతా – ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు : నారా బ్రాహ్మణి వ్యాఖ్యనించారు.
