చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ భీమిలి టీడీపీ నేతలు కాగడాల ర్యాలీ.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ భీమిలి టీడీపీ నేతలు కాగడాల ర్యాలీ.

భీమిలి: వి న్యూస్ :సెప్టెంబర్ 16:-

టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం అక్రమ అరెస్టుకు నిరసనగా భీమిలి టీడీపీ ఇంచార్జ్, మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడరాజబాబు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం, చిన్నబజార్ అన్న యన్.టి.ఆర్ విగ్రహాం నుండి పెద్ద బజార్ ఘంటస్థంబం వరకు కాగడాలతో ర్యాలీ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణ రావు, జి.వి.యం.సి. రెండవ వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి, తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.