బిఎన్ డబ్ల్యు , వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో400 మట్టి విగ్రహాలు పంపిణీ

బిఎన్ డబ్ల్యు , వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో400 మట్టి విగ్రహాలు పంపిణీ 

భీమిలి మండలం వి న్యూస్ :సెప్టెంబర్ 16:-

భీమునిపట్నం పర్యావరణ పరిరక్షణ లో భాగంగా బిఎన్ డబ్ల్యు , వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో   వినాయక చవితి కి మట్టి విగ్రహాల పంపిణి కార్యక్రమం శనివారం కొత్త మూలకొద్దు గ్రామంలో సర్పంచ్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ 400  మట్టి విగ్రహాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోటిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఎందరో అనాధులకు బాసటగా నిలిచి, మరెన్నోసేవా , సామాజిక కార్యక్రమాలలో పాల్గొని, చిన్న వయసులోనే  తెలంగాణాలో కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో,మహారాష్ట్ర పూణేలో స్ధాపించిన గ్లోబల్ స్కాలర్ షిప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో,అదేవిధంగా న్యూఢిల్లీలో వరల్డ్ హ్యుమన్ రైట్స్ ప్రొటక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు లు అందుకున్న వెంపాడవెల్ఫేర్ సొసైటి సభ్యులు వెంపాడ శ్రీనివాసరెడ్డిని  అభినందించారు. అనంతరం వెంపాడ శ్రీనివాస్ రెడ్డి ని  సాలువా తో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంపాడ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సురేష్,  కొయ్య. రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్. వెంకట సత్యం, ఎరుసు వెంకటరమణ, రామ చిట్టి, చిల్ల. శ్రీను, కొల్లి రామకృష్ణ, చిల్ల  గురయ్య రెడ్డి, కొయ్య బద్ర తదితరులుపాల్గొన్నారు.