ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు ఇలా!
ఏపీ:వి న్యూస్: ఆగష్టు 01:
ఏపీలో భారీ వర్షాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపించింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీలో చెదురుమదురు వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో ఉందని.. దాని వల్ల తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్ష సూచన ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారుతోంది.. మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతోంది. ఈ అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుంది అంటున్నారు. అలాగే IMD సూచన ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీద ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఆ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం మయన్మార్ వైపు నుంచి.. ఏపీ వైపుగా కదులుతోంది. ఏపీ వైపు వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.