కిడ్నీ బాధితునికి ఆర్ధిక సాయం అందజేత
ఇచ్ఛాపురం -వి న్యూస్: ఆగష్టు 01:
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం బెల్లుపాడ కాలానికి చెందిన సింహాద్రి అనే కిడ్నీ బాధితునకు మూడు నెలలకు సరిపడే మందులతో పాటు కొంత నగదుని విశాఖపట్టణం పోర్టు పరిధిలో ఉండే ట్రాఫిక్ విభాగపు అధికారి రత్న శేఖర్, మదర్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు. అనంతరం ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుప్రజ రౌత్ మాట్లాడుతూ ఉద్దాన పరిధిలోనే కాకుండా జిల్లాతో పాటు, రాష్ట్రంలో ఎక్కడ అవసరం అయినా మదర్స్ లవ్ ఫౌండేషన్ ని సంప్రదిస్తే ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. బాధితుడు దినకూలీ కావటంతో మందులకు ఫౌండేషన్ ని సంప్రదించారని, సహాయం చేయాలనుకునే వారు ఫౌండేషన్ ని సంప్రదించాలన్నారు.