జనసేన పిఎసి చైర్మన్ తో అల్లూరి జిల్లా యువ నాయకులు భేటీ
అల్లూరి సీతారామరాజు జిల్లా వి న్యూస్ ఆగస్టు 1 :-
విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పిఎసి) చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మర్యాదపూర్వకంగా కలిసిన అల్లూరి జిల్లా జనసేన యువ నాయకులు కలవటం జరిగింది. ఆరకు నియోజకవర్గానికి ఇంఛార్జి నీ నియమించి పార్టీ బలోపేతం అయ్యేందుకు... ఇంచార్జి తో పాటుగా నియోజకవర్గ కమిటీలను నియమించాలని వారు కోరారు. ఇంఛార్జి లేని కారణంగా ప్రజాసమస్యలపై పోరాటం చెయ్యటం లో విదానపరమైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నాము అని చెట్టి ఆనంద్ మరియు చిరంజీవి వారి దృష్టికి తీసుకెళ్లగా.... అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చేస్తాను అనీ చెప్పటం జరిగింది అని వారు తెలియజేశారు.